Salaar, RRR: ఆర్ఆర్ఆర్ రికార్డ్ కు చెక్ పెట్టిన సలార్ మూవీ.. అసలేమైందంటే?

  • December 23, 2023 / 10:26 AM IST

సలార్ మూవీ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు రికార్డ్ స్థాయిలో ఆక్యుపెన్సీ ఉంది. అయితే ఇప్పటికే కొన్ని రికార్డులకు చెక్ పెట్టిన సలార్ నైజాంలో ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ప్రభాస్ నైజాం కింగ్ గా అవతరించారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నైజాంలో తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి ఈ సినిమా 12.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ నైజాంలో 10.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఆ సినిమా రికార్డ్ ను భారీ మార్జిన్ తో ఈ సినిమా బ్రేక్ చేసింది. సలార్ మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ మూవీ అదిరిపోయే రికార్డ్ లను సొంతం చేసుకుంటూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఇతర భాషల్లో సైతం ప్రభాస్ సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. బాలీవుడ్ లో సైతం ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. టికెట్ రేట్ల పెంపు సలార్ కు కలిసొచ్చింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా సలార్ మూవీ నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరో మూడు రోజుల వరకు ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది

డంకీ, సలార్ మధ్య పోటీ నెలకొనగా (Salaar) సలార్ మూవీ విన్నర్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. డంకీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి. సలార్ మూవీ యాక్షన్ మూవీ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. సలార్2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus