Salaar: బాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ షాకిచ్చేలా సలార్ కలెక్షన్లు.. అసలేమైందంటే?

  • December 24, 2023 / 11:40 AM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ తొలిరోజే 178 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ డే షేర్ కలెక్షన్లు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి. సలార్ మూవీ కలెక్షన్లను చూసి టెన్షన్ పడటం బాలీవుడ్ వంతైంది. డంకీ సినిమా ఫ్లాప్ కావడం అదే సమయంలో సలార్ బాలీవుడ్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం బాలీవుడ్ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది.

సలార్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లతో ఏ రికార్డులు మిగలవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం ఈ సినిమా కలెక్షన్లు భారీ షాకిస్తున్నాయి. ఇతర సౌత్ భాషల్లో సైతం ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. సలార్2 సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ వస్తే బాగుంటుందని చెప్పవచ్చు. కేజీఎఫ్3 సినిమాలా సలార్2 మూవీని ఆలస్యం చేయొద్దని ఫ్యాన్స్ చెబుతున్నారు.

హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఆ సినిమాలతో అంతకు మించిన భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సినిమాల ద్వారా ఈ నిర్మాతల ఆదాయం మరింత పెరుగుతోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతుండటం గమనార్హం. హోంబలే బ్యానర్ తర్వాత సినిమాలు ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ బ్యానర్ గా ఈ బ్యానర్ కొనసాగుతోంది. ఈ బ్యానర్ లో సినిమా తెరకెక్కితే సినిమా హిట్ అని చాలామంది భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అద్భుతమైన స్క్రిప్ట్ లను పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిస్తూ నిర్మాతలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus