Salaar, Dunki: సలార్ తో పోటీకి ఓకే చెప్పి షారుఖ్ ఖాన్ పెద్ద తప్పు చేశారా?

  • December 26, 2023 / 01:47 PM IST

డంకీ, సలార్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కావడం వల్ల డంకీ సినిమా ఊహించని స్థాయిలో నష్టపోయింది. అన్ని భాషల్లో డంకీపై సలార్ సినిమా పైచేయి సాధిస్తుండటం గమనార్హం. సలార్ తో పోటీ లేకపోతే సోలో రిలీజ్ డేట్ దక్కి ఉంటే డంకీకి కనీసం నష్టాలు తగ్గేవని కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ తో పోటీకి ఓకే చెప్పి షారుఖ్ ఖాన్ పెద్ద తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు డంకీ సినిమా పోటీ వల్ల సలార్ కొన్ని థియేటర్లు నష్టపోయినా (Salaar) సలార్ మూవీ ప్రదర్శించబడిన థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకు ఆ విధంగా ప్లస్ అయింది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారనే చెప్పాలి. భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై ప్రశాంత్ నీల్ అంచనాలను అమాంతం చేశారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ త్వరలో మొదలు కానుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానినని చాలా సందర్భాల్లో చెప్పిన ప్రశాంత్ నీల్ తారక్ ను మరింత పవర్ ఫుల్ గా చూపిస్తారేమో చూడాలి. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ప్రశాంత్ నీల్ ఇప్పటికే పూర్తి చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రశాంత్ నీల్ తో మరికొన్ని సినిమాలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అజిత్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అజిత్ 65వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి మైత్రీ మేకర్స్ నిర్మాతలు స్పందిస్తే మాత్రమే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus