Salaar: ఆర్ఆర్ఆర్ రికార్డ్ కు చెక్ పెట్టిన సలార్.. అసలేమైందంటే?

  • August 10, 2023 / 04:41 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటి. విడుదలకు ముందు, విడుదల తర్వాత ఈ సినిమా ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై 500 రోజులు అవుతున్నా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో ప్రభాస్ నటించిన సలార్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే సలార్ (Salaar) మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 285 సినీ మార్క్ థియేటర్లలో రిలీజ్ కాగా సలార్ మూవీ 1980కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ కు సలార్ చెక్ పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సలార్1, సలార్2 కచ్చితంగా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కోరుకున్న విజయాన్ని సలార్1 తో సాధిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒకింత ప్రత్యేకంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

సలార్ మూవీ 5000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ పార్ట్1 ను మించి సలార్ పార్ట్2 ఉండబోతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సలార్ సినిమాలోని సాంగ్స్ కూడా అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus