Salaar: ప్రభాస్ సలార్ కు హైలెట్ అయ్యే ఫైట్ సీన్ ఇదేనా?

  • December 16, 2023 / 10:24 AM IST

ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. మరో ఐదు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆ అప్ డేట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రభాస్ సలార్ సినిమాలో ఫైట్ సీన్లు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని వార్తలు తెగ ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వందలాది జాంబీలతో ప్రభాస్ ఫైట్ చేస్తారని ఆ ఒక్క సీక్వెన్స్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. సలార్ మూవీ డబ్బింగ్ కోసం పని చేసిన వ్యక్తి ఈ విషయాలను వెల్లడించడంతో ఆ వ్యక్తి చెప్పిన విషయాలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది. సలార్ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

పాన్ ఇండియా మూవీగా ఎక్కువ సంఖ్యలో భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా అంచనాలను మించి మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో తెలుగు నటులకు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత దక్కింది. సలార్1, సలార్2 సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే సినిమాలు అవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన సలార్ (Salaar) మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ సక్సెస్ సాధించి రిలీజ్ తర్వాత కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ రేంజ్ ను పది రెట్లు పెంచేలా సలార్ మూవీ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో, భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus