Salaar: సలార్ మూవీ ఫ్రీ టికెట్స్ పొందాలనుకుంటున్నారా.. ఏం చేయాలంటే?

  • December 1, 2023 / 05:47 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా సలార్ ట్రైలర్ రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే సలార్ మూవీ మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఉచితంగా సలార్ మూవీ టికెట్స్ పొందే అవకాశాన్ని సలార్ మేకర్స్ కల్పించడం గమనార్హం. సలార్ టీమ్ ట్విట్టర్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటోను పోస్ట్ చేసి మంచి క్యాప్షన్ చెప్పిన ఐదుగురికి వాళ్ల ఏరియాలో ఉన్న ఒక థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్, సలార్ టీ షర్ట్ ఫ్రీగా ఇస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఈ నెల 22వ తేదీన సలార్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. మరో మూడు వారాల తర్వాత థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఇద్దరు స్నేహితులు బద్ధ శత్రువులు అయ్యే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా సలార్ మూవీ ట్రైలర్ తో ఈ సినిమాకు సంబంధించిన అనేక సందేహాలకు చెక్ పడే ఛాన్స్ అయితే ఉంది.

సలార్ సినిమా ప్రశాంత్ నీల్ రేంజ్ ను పది రేట్లు పెంచే సినిమా కావాలని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న శృతి హాసన్ ఈ నెలలో హాయ్ నాన్న, సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సలార్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. సలార్ 2 ర్లిలీజ్ డేట్ గురించి కూడా సలార్ తో క్లారిటీ రావాలని మరి కొందరు ఫీలవుతున్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేయడం గ్యారంటీ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సలార్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సలార్ (Salaar) సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus