మొన్నామధ్య మన సైట్‌లో మనం ఓ మాట అనుకున్నాం గుర్తుందా? ప్రభాస్ సినిమాలకు ఎందుకంత కష్టం వచ్చింది. వరుసగా సినిమాలు అనుకున్న డేట్‌లో కాకుండా, ఆ మాటకొస్తే ఆ సీజన్‌లోనే కాకుండా మరో డేట్‌కో, సీజన్‌కో వెళ్లిపోతున్నాయని. అయినా ఇప్పుడెందుకు ఆ సంగతి అంటారా? ఉందీ కారణం ఉంది. నవంబరులో అంటూ ఇటీవల కాలంలో పుకార్లు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వచ్చే ఏడాదికి వెళ్లిపోతోంది అంటున్నారు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్: ది సీజ్ ఫైర్’. ఈ సినిమాకు రెండో పార్టు కూడా ఉంది.
అయితే ఫస్ట్ పార్ట్ సెప్టెంబరు 28న విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోందని టీమ్ చాలా ఆలస్యంగా చెప్పింది. అయితే నవంబరు ఆఖరున సినిమా రావొచ్చని అనధికారిక వార్తలు శాండిల్‌వుడ్ నుండి వచ్చాయి. ఇప్పుడు అది కూడా కష్టమే అంటున్నారు. దీనికి కారణంగా రెండు, మూడు రకాల విషయాలు కనిపిస్తున్నాయి. అందరూ అంటున్నట్లు ఈ సినిమా రైట్స్ విషయంలో నిర్మాణ సంస్థ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు.
అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతృప్తిగా లేరని కూడా అంటున్నారు. దీంతో ఈ సినిమాను వాయిదా వేశారు అని చెబుతున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా డిజాస్టర్ తర్వాత ప్రభాస్ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోమని అడుగుతున్నారట. దీంతో నవంబరులో కానీ, డిసెంబరులో కానీ ‘సలార్’ను (Salaar) తీసుకొచ్చే పరిస్థితి లేదని దాదాపుగా తేల్చేస్తున్నారు.
అలాగే ఈ భారీ సినిమా సంక్రాంతి సీజన్‌కి కాని, సమ్మర్ సీజన్‌లో కానీ వస్తే బెటర్ కదా అనే మాట డిస్ట్రిబ్యూటర్ల నుండి వస్తోందట. దీంతో ఈ సినిమాను 2023లో కాకుండా 2024లో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అని అంటున్నారు. అందుకే మొన్నీమధ్య వచ్చిన లెటర్‌లో కూడా ఆ విషయం చెప్పలేదు అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ పక్కా అంటున్నారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!