Salaar: సలార్ సినిమా వాయిదా పడటం వెనుక ఇంత కథ ఉందా?

  • December 13, 2023 / 12:14 PM IST

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తాజా చిత్రం సలార్ ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సినిమాకు కే జి ఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వం వహించగా కేసిఎఫ్ సినిమాని నిర్మించినటువంటి నిర్మాతలు హోం భలే ఫిలిమ్స్ వారు నిర్మించారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ ప్రభాస్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి కానీ సలార్ సినిమాపై మాకు చాలా నమ్మకం ఉందని ఈయన తెలియజేశారు. ఇక ప్రభాస్ సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఈయన సినిమాలకు తొలి రోజు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని ఇలా ఏ హీరోల సినిమాలకు రావని ఇలాంటి రికార్డు సాధించడం కేవలం ప్రభాస్ సినిమాలకు మాత్రమే సాధ్యమవుతుంది అంటూ ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ వాయిదా పడటానికి కారణాలను కూడా తెలియజేశారు. విఎఫ్ ఎక్స్ పనులు వాయిదా పడటం వల్లే ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కాలేదని ఈయన వెల్లడించారు. అంతేకాకుండా సినిమాల విడుదల విషయంలో మేము గత 12 సంవత్సరాల నుంచి జ్యోతిష్యం ప్రకారమే సినిమా విడుదల తేదీలను ఖరారు చేస్తున్నామని,

సలార్ (Salaar) విషయంలో కూడా అదే జరిగింది అంటూ ఈయన తెలియజేశారు. అంటే జ్యోతిష్యం ప్రకారమే జాతకం చూసి మరి ఈ సినిమాని డిసెంబర్ 22వ తేదీకి పోస్ట్ పోన్ చేశారా అంటూ పలువురు ఈ సినిమా విడుదల వాయిదా పడటంపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus