Salman Khan, Dhanush: మరో హీరో కోసం టైటిల్ వదులుకున్న సల్మాన్!

  • December 6, 2021 / 11:14 AM IST

సినిమా ఇండస్ట్రీలో టైటిల్ కోసం పెద్ద పెద్ద వివాదాలు చెలరేగిన సంఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి కోర్టు వరకు కూడా టైటిల్ గొడవలు వెళ్లాయి. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో ధనుష్ కోసం తన టైటిల్ ను ఇచ్చేయడం విశేషం. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘ఆత్రంగీరే’ అనే సినిమా చేశాడు ధనుష్. సారా అలీఖాన్ హీరోయిన్ గా నటించింది. అక్షయ్ కుమార్ ఓ కీలకపాత్రలో కనిపించారు.

రీసెంట్ గా విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నెల 24న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడొక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు ఆనంద్. అందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు దర్శకుడు ఆనంద్. ‘ఆత్రంగీరే’తో పాటు అక్షయ్ కుమార్ హీరోగా ‘రక్షాబంధన్’ కూడా తీస్తున్నాడు ఆనంద్. ఈ రెండు సినిమాల టైటిల్స్ ని రిజిస్టర్ చేయడానికి వెళ్లినప్పుడు ఓ సమస్య వచ్చిందట. ‘రక్షాబంధన్’ సినిమాను రిజిస్టర్ చేశారు కానీ ‘ఆత్రంగీరే’ను చేయడానికి కుదరదని చెప్పారట.

అది సల్మాన్ ఖాన్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించారని.. అతడికే రైట్స్ ఉన్నాయని చెప్పారట. వెంటనే సల్మాన్ కి ఫోన్ చేసి విషయం చెప్తే.. ఆనంద్ ఎల్ రాయ్ అడిగితే మాత్రం టైటిల్ అతనికి ఇవ్వమని.. తనకు తప్ప ఎవరికీ ఇవ్వొద్దని చెప్పారట. దాంతో వాళ్లు ఆ టైటిల్ ని ఆనంద్ కి ఇచ్చారట. సల్మాన్ కి తనపై అభిమానం ఉన్నందుకు ఆనందంగా ఉందని దర్శకుడు ఆనంద్ చెప్పుకొచ్చాడు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus