Salman Khan: తెలుగు ప్రేక్షకులకు సల్మాన్‌ డబుల్‌ ఆఫర్‌!

  • December 2, 2021 / 12:42 PM IST

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను ఇష్టపడని తెలుగువారుండరు. ఆయన సినిమాలు వస్తే… మన దగ్గర కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే సల్మాన్‌ ఖాన్‌ తెలుగులో నటిస్తే బాగుండు అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. అయితే ఇది అంత ఈజీ కాదు అనే మాట వినిపిస్తుంది. కానీ ఇప్పుడు సల్మాన్‌ తెలుగులో నటిస్తున్నాడు… అది కూడా ఒక సినిమా కాదు, ఏకంగా ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ విషయం సల్మానే చెప్పాడు.

బావమరిది ఆయుష్‌ శర్మతో కలసి సల్మాన్‌ నటించిన చిత్రం ‘అంతిమ్‌’. ఈ సినిమా ప్రచారం కోసం సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల హైదరాబాద్‌ వచ్చాడు. సినిమా గురించి మాట్లాడుతూ… తెలుగు సినిమాల ముచ్చట కూడా చెప్పుకొచ్చాడు. చిరంజీవి, వెంకటేశ్‌ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు. రెండు తెలుగు సినిమాల్లో స్పెషల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను. త్వరలో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను అని చెప్పాడు సల్మాన్‌. తెలుగులో చిరంజీవి‘గాడ్‌ఫాదర్‌’లో నటిస్తున్నా. అయితే ఈ సినిమాలో నా పాత్రేంటి అని సల్మాన్‌ అడగలేదట.

నా సినిమాలో చేయాలని చిరంజీవి అడిగారు.. ఎన్ని రోజులు కాల్షీట్లు కావాలన్నా అంతే అని చెప్పాడు సల్మాన్‌. అలాగే త్వరలో వెంకటేష్‌తోనూ ఓ సినిమాలో నటించబోతున్నాను. ఆ సినిమా వివరాలు త్వరలో తెలుస్తాయి అని చెప్పాడు భాయ్‌. ఇక హిందీ సంగతి చూస్తే… ‘భాయీజాన్‌’, ‘దబంగ్‌ 4’, ‘టైగర్‌ 3’ చేస్తున్నాడు సల్మాన్‌ ఖాన్‌.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus