కొత్త అమ్మాయిని కసురుకొన్న ఖాన్ భాయ్ !!
- December 26, 2016 / 02:02 PM ISTByFilmy Focus
సాధారణంగా హీరోయిన్లంటే ఆ ఉడ్ ఈ ఉడ్ అన్న బేధం లేకుండా అన్నీ ఉడ్ ల హీరోలకూ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందుకే వాళ్ళ గురించే కాక వాళ్ళ కెరీర్ ల గురించి కూడా జాగ్రత్తలు తీసుకొంటూ వాళ్ళ ఎదుగుదలకు పునాదులవుతుంటారు. సల్మాన్ ఖాన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనతో ఒక హీరోయిన్ యాక్ట్ చేసిందంటే ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చే వరకూ సల్మాన్ ఊరుకోడు. అటువంటి సల్లు భాయ్ ఒక కొత్త హీరోయిన్ గా కస్సుమన్నాడు. అయితే.. ఆ అమ్మడు సల్మాన్ సరసన నటించడం లేదు లెండి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న “బిగ్ బాస్ 10″లో పార్టిసిపేట్ చేస్తోంది.
అమ్మడి పేరు ప్రియాంక జగ్గా, ప్రస్తుతం “బిగ్ బాస్ 10″లో పాల్గొంటుంది. ఈ షోను నిర్వహిస్తున్న సల్మాన్ ఖాన్ కు ప్రియాంక బిహేవియర్ అస్సలు నచ్చలేదంట. అందుకే సెట్ లో నుంచి ఉన్నపళంగా వెళ్లిపోమని చెప్పడంతోపాటు.. “ఈ అమ్మాయి ఇంకోసారి సెట్స్ కు వస్తే నేను ఈ షోను హోస్ట్ చేయను” అని ఖరాకండిగా తేల్చి చెప్పేశాడట. స్వయంగా సల్మాన్ ఖాన్ తనపై నిప్పులు చెరగడంతో దిక్కుతోచని ప్రియాంక జగ్గా సైలెంట్ గా సైడ్ అయిపోయిందట!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















