బాహుబలి కంక్లూజన్ విజయంపై స్పందించిన సల్మాన్ ఖాన్
- June 14, 2017 / 09:46 AM ISTByFilmy Focus
దర్శకధీరుడు తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ బాషా బేధం లేకుండా విడుదలయిన నాలుగు భాషల్లో కలక్షన్ల వర్షం కురిపించింది. అన్నింటికంటే హిందీ భాషలో ఎక్కువ వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ చిత్రాల రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో బాలీవుడ్ నటీనటులు చూసి రాజమౌళి టీమ్ ని అభినందించారు. తాజాగా ఈ సినిమా విజయంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. ‘ట్యూబ్‌లైట్’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా బాహుబలిపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘‘బాహుబలి-2’ విజయం వెనుక హిందీ ప్రేక్షకుల పాత్ర ఉంది. వాళ్లకు దక్షిణాదిలో ముగ్గురు.. నలుగురు కథానాయకులు మించి ఎవరూ తెలియదు. అయినప్పటికీ ఈ సినిమాని వాళ్లు ఆదరించారు. ఓ తెలుగు సినిమాకు అంతపెద్ద విజయాన్ని అందించారు.” అని వివరించారు.
” దక్షిణాది ప్రేక్షకులకు మేం తెలిసినా మా సినిమాలు ఈ రేంజ్‌లో బిజినెస్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే అక్కడి హీరోలను దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తారు. కమల్‌హాసన్ ఫ్యాన్ అంటే అతను ఎప్పటికీ కమల్ అభిమానిగానే ఉంటాడు. రజనీకాంత్ అభిమాని అయితే ఎప్పటికీ రజనీనే అభిమానిస్తాడు. వాళ్లతో పోల్చినపుడు మమ్మల్ని అంతగా అభిమానించరు’’ అని దక్షిణాది ప్రేక్షకుల అభిమానం గురించి సల్మాన్ చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















