కరోనా కారణంగా సల్మాన్ ఖాన్ సినిమాలకు గ్యాప్ వచ్చింది. వేగంగా సినిమాలు చేసే అలవాటున్న సల్మాన్.. లేట్ అయ్యాడు. దీంతో ఎప్పుడో అనౌన్స్ అయిన ‘కబీ ఈద్ కబీ దివాళీ’ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. పరిస్థితులు చక్కబడటంతో ఇటీవల సినిమా పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇంతలో సల్మాన్‌ను బెదిరింపు లేఖలు వచ్చాయి. సిద్ధూ మూసేవాలాను హంతమొందించినట్లే నీ సంగతి చూస్తాం అంటూ బెదిరింపు లేఖలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వచ్చేశాడని టాక్.
సల్మాన్ ఖాన్, సలీమ్ ఖాన్‌ను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన సల్మాన్ ఖాన్.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గతంలో అంటే 2018లో సల్మాన్‌ను చంపేస్తామంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పుడ అతని నుండే సల్మాన్ ఖాన్‌కు ప్రాణభయం ఉంది అంటున్నారు.అంతేకాదు ఈ వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల బయటకొచ్చింది.
దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు సల్మాన్‌కి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే భారీ భద్రత నడుమ సల్మాన్ ఖాన్ హైదరాబాద్ తీసుకొచ్చినట్లు సమాచారం. షూటింగ్ కోసం సల్మాన్ హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాకు ఫర్హాద్ సామ్‌జి దర్శకుడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకు అన్నయ్యగా వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.
దాదాపు నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట. ఇందులో సల్మాన్‌తోపాటు పూజా హెగ్డే, వెంకటేష్ పాల్గొంటారట. దీంతో ఫిలింసిటీలో భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బెదిరింపులు వచ్చినప్పటికీ భయపడకుండా సల్మాన్ ఖాన్ తన సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అన్నట్లు ఈ సినిమాకు ‘కబీ ఈద్ కబీ దివాళీ’ పేరును మార్చే యోచనలో చిత్రబృందం ఉందట. కొత్తగా ఏం పేరు పెడతారు అనేది చూడాలి.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!