Tiger 3: సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌-3’ ఆ భాషల్లో కూడా రిలీజ్ కానుందా?

  • October 19, 2022 / 12:51 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మీద గౌరవంతో.. ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటినుండే సల్లూ భాయ్ ని హైలెట్ చేస్తూ వస్తుంది టీం.. ఈ దసరాకి ధియేటర్లలోకి వచ్చిన ‘గాడ్ ఫాదర్’ పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం తన సినిమాల మీద ఫోకస్ పెట్టాడు సల్మాన్.. తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన ‘టైగర్’ సిరీస్ లో.. ఇంతకుముందు ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలొచ్చాయి.

ఈ రెండు కూడా ఒకదాన్ని మించి మరోటి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పడు రాబోతున్న మూడో సినిమాకి ‘టైగర్ 3’ టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తుండగా.. కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తోంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దివాళీకి రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల చెయ్యబోతున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్స్ వదిలారు.

ఈమధ్య సౌత్ లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ పాన్ ఇండియా సినిమాలొస్తున్నాయి.. సల్మాన్ ఖాన్ కి ఎలాగో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ మూడు భాషలతో పాటు కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా అయిపోతుంది కదా అనే టాక్ కూడా వినిపిస్తోంది. రిలీజ్ కి ఎలాగో ఇంకా ఏడాది ఉంది.. అప్పటికి మేకర్స్ ఆలోచనమారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

2019లో వచ్చిన ‘భారత్’ తర్వాత సల్లూ భాయ్ కి సరైన హిట్ పడలేదు.. దీంతో తనకు అచ్చివచ్చిన ‘టైగర్’ ఫ్రాంచైజీ పైనే నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సిరీస్ లో ముచ్చటగా మూడవ సినిమాగా వస్తున్న ‘టైగర్ 3’ తో తమ అభిమాన నటుడు తిరిగి ట్రాక్ లోకి వస్తాడని సల్మాన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus