అసలు ఎప్పుడు తీసారు? ఎక్కడ తీసారో? కూడా తెలియని ఓ చిన్న సినిమా సంచలన విజయం దక్కించుకోవడంతోపాటు.. తెలుగు సినిమా స్టామినాను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ సినిమా పేరు “క్షణం”. కేవలం కోటిన్నర రూపాయల పరిమిత బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే అయిదారు కోట్ల వరకూ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు పలువురు బాలీవుడ్ నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం మేరకు.. “క్షణం” హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియావాలా దక్కించుకొన్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ రీమేక్ లో నటించనున్నట్లు సమాచారం.