ఆయుధాలు పట్టిన సమంత, శృతి!

  • April 20, 2017 / 08:19 AM IST

హెడ్డింగ్ చూసి శృతిహాసన్ కత్తిలా ఉంటుంది. సమంత కర్రలా ఉంటుంది.. అని పోలిస్తున్నామని అనుకోకండి. విషయం ఏమిటంటే.. తమిళ దర్శకుడు సుందర్‌.సి ‘సంఘమిత్ర’ పేరుతో చారిత్రక నేపథ్యంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మల్టీస్టారర్‌గా రూపొందే ఈ చిత్రంలో భారీ ఎత్తున పోరాట సన్నివేశాలు ఉంటాయి. అందుకోసం లండన్‌లోని మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ లో శృతిహాసన్ కత్తిఫైట్ లో ట్రైనింగ్ తీసుకుంటోంది. శిక్షణ తీసుకుంటున్న శృతి ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ లోకి రాగానే సమంత కర్ర సాము వీడియో దూసుకొచ్చింది. సమంత మిస్టేక్ లేకుండా అద్భుతంగా కర్ర తిప్పుతున్న వీడియో లైక్లు షేర్లు అందుకుంటోంది.

ప్రస్తుతం సమంత తెలుగులో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా 1980 నటి కాలంలో జరిగే కథ కావడంతో అప్పటి పల్లెటూరు అమ్మాయిలకు కర్ర సాములో కొంత ప్రావీణ్యం ఉండేది. సో వాటిని మళ్ళీ పరిచయం చేయడానికి డైరక్టర్ సమంతతో కర్ర సాము చేయిస్తున్నాడు.  అందాల తారలు అనుష్క, తమన్నాలు కత్తి పట్టి శెభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీల వంతు అయింది. సినిమాలో వీరి సాహసాలు చూడాలని ఇప్పటి నుంచే ఆసక్తి కలిగిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus