ఈ భూప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా మెట్టినిళ్ళు రెండుమూడు ఉన్నా.. అత్తారిల్లు మాత్రం ఒకటే ఉంటుంది. కానీ.. సమంతకు మాత్రం ఆమె భర్త నాగచైతన్య పుణ్యమా అని రెండు రెండు అత్తారిల్లు దొరికాయి. ఒకటేమో అక్కినేని అమలగారి స్వగృహం హైద్రాబాద్ కాగా.. మరొకటేమో చెన్నైలో నాగార్జున మొదటి భార్య, నాగచైతన్య సొంత తల్లి అయిన లక్ష్మీగారి ఇల్లు. నిన్న సమంత-నాగచైతన్యల రెండో రెసెప్షన్ (ఆల్రెడీ సురేష్ బాబు ఒక రిసెప్షన్ ను హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆర్గనైజ్ చేసారు) జరిగింది. అక్కినేని నాగచైతన్య-అక్కినేని సమంతలతోపాటు రాణా దగ్గుబాటి మరియు చైతన్య పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్న ఈ ఫంక్షన్ చెన్నై లో జరిగింది.
అక్కడ పెద్దత్తగారి టేస్ట్ కి సమంత ఫిదా అయిపోయింది. లక్ష్మీగారు ఎంతో అందంగా అమర్చిన పూల కుండీలు మొదలుకొని ఇంట్లో ప్రతి వస్తువును ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా అందరితో పంచుకొంది. ఎమ్మా సమంతా మరి పెద్దత్తగారి ఇల్లు అంతగా నచ్చేస్తే అక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా అంటూ కొందరు నెటిజన్లు సమంతపై పోస్టులపై చిలిపిగా స్పందించారు.