Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

రీసెంట్ గానే రెండవ మ్యారేజ్ చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సమంత-రాజ్ జంట. ప్రస్తుతం ఈ జంట ఏది చేసినా హాట్ టాపిక్ గా వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మన ప్రాచీన సంప్రదాయాలలో చాలా ప్రాముఖ్యత కలిగిన భూత శుద్ధి వివాహ పద్ధతిలో కోయింబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో వీరి వివాహ తంతు నిర్వహించబడింది. దీనికి సంబందించిన ఫోటోలను హీరోయిన్ సమంత స్వయంగా సోషల్ మీడియా లో షేర్ చేశారు.

Samantha

ఇది చూసిన సమంత అభిమానులు తమ అభిమాన నటి కొత్త జీవితం హ్యాపీ గా ఉండాలంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట పెళ్లి అయిన మరుసటిరోజే హనీమూన్ కి గోవా వెళ్లినట్లు సమాచారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్తున్నప్పుడు నెటిజన్లు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్ లోకి వచ్చాయి. సమంత హ్యాపీగా నవ్వుతూ తన హాండ్స్ చూపిస్తుండగా, రాజ్ఆ ఫొటోలను క్యాప్చర్ చేయటం గమనించవచ్చు.

సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు. కాగా దాదాపుగా సంవత్సరం క్రితం 2024 డిసెంబర్ 4న నాగ చైతన్య-శోభిత కూడా రెండవ వివాహం ద్వారా ఒక్కటైన విషయం అందరికి తెల్సిందే.

ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus