అందుకే ఆ కమెడియన్ ను నిజంగా కొట్టాను : సమంత

Advertisement

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రంగా ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం జులై 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్లు చూస్తుంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనిపిస్తుంది. అందుకే ప్రేకాకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు మరో పది రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్లు వేగం పెంచారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సమంత. ‘ఈ చిత్రంలో ఓ షాట్ కోసం కమెడియన్ ధన్ రాజ్ ను నిజంగానే కొట్టారట గదా?’ ట్రైలర్లో ఆ విషయం తెలిసిపోతుంది అనే ప్రశ్న సమంతకి ఎదురైంది.

దీనికి సమంత బదులిస్తూ.. “పాపం .. ధన్ రాజ్ .. పాత్రలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను .. అందుకే నిజంగానే కొట్టేశాను. నేను ఒక పట్టాన సంతృప్తి చెందను…సంతోష పడిపోను. టీజర్ బాగా వచ్చిందంటే .. ట్రైలర్ ఇంకా బాగా రావాలని చెబుతాను. ట్రైలర్ బాగా వచ్చిందంటే .. ఆ తరువాత ఇచ్చేది మరింత బెటర్ గా ఉండాలని చెబుతుంటాను. నేను చేసింది డైరెక్టర్ ఓకే అన్నప్పటికీ, పర్ఫెక్షన్ కోసం మళ్ళీ ఒక టేక్ చేద్దామని చెబుతుంటాను” అంటూ చెప్పుకొచ్చాను.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus