‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 లో ఉగ్రవాది పాత్రలో కనిపించింది సమంత. ముఖ్యంగా తొలిసారి ఆమె బాలీవుడ్ లో నటించిన ప్రాజెక్ట్ ఇది. ఇన్నాళ్లు సౌత్ లోనే నటించిన సమంతకు బాలీవుడ్ లో నటించే సమయంలో ఎలాంటి తేడా కనిపించలేదని అంటోంది. దర్శకులు రాజ్, డీకే లతో కలిసి వర్క్ చేయడం కొత్తగా అనిపించిందే తప్ప.. టాలీవుడ్ నుండి బయటకొచ్చి చేస్తున్నట్లు ఎక్కడా అనిపించలేదని చెప్పింది. ఇద్దరు మేకర్స్ తో ఒకే ప్రాజెక్ట్స్ చేయడం కాస్త ఇబ్బంది అనిపించిందని..
అందుకే షాట్ చేసి ప్రతీసారి ఇద్దరిలో ఎవరో ఒకరిపై ఆధారపడేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఒక సీన్ ను ఇద్దరూ చర్చించుకునే విధానం బాగా నచ్చిందని.. మొత్తం వాళ్లే డిస్కస్ చేసుకోవడంతో తనకు కలుగజేసుకొని అవసరం రాలేదని చెప్పింది. వాళ్ల డిస్కషన్లు చూసిన తరువాత ఇక ప్రశ్నలు అడగకూడదని నిర్ణయించుకున్నానని.. వాళ్లు చెప్పింది చేసుకుంటూ పోవాలని ఫిక్స్ అయ్యాయని తెలిపింది. తన పాత్ర కేవలం టెర్రరిస్ట్ వరకే ఉండదని.. చాలా లేయర్స్ ఉంటాయని చెబుతోంది.
రాజి పాత్ర చేయడానికి శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది సమంత. ఫిజికల్ గా చాలా కష్టపడాల్సి వచ్చిందని.. కానీ అంతా ఇష్టంతో చేశానని అంటోంది. ఇక రాజి పాత్రకు సంబంధించి ముఖంపై కత్తిగాటు ఉంటుంది. పోస్టర్ లో కూడా దాన్ని బాగా హైలైట్ చేసి చూపించారు. ఆ సంగతేంటని సమంతని అడిగితే మాత్రం చెప్పకుండా తప్పించుకుంది. సీజన్ 2 చూసి తెలుసుకోవాల్సిందే అంటూ ఊరిస్తోంది.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!