నెటిజెన్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన సమంత..!

  • November 6, 2020 / 04:18 PM IST

ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది సమంత. తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.దాంతో పాటు ‘ఫ్యామిలీ సీజన్2′(హిందీ) వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. అంతేకాకుండా సమంత త్వరలో..స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి ఆహా యాప్ కోసం ఓ షో చేస్తుందట.

బహుశా ఈ షో ప్రమోషన్లలో భాగంగానే అనుకుంట.. తాజాగా తన సోషల్ ‌మీడియాలో ఓ చిట్ చాట్ సెషన్ ను నిర్వహించింది. ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్‌ చేసిన కామెంట్‌కు సమంత ఫన్నీ రిప్లై ఇచ్చింది. వివరాల్లోకి వెళితే… ” ‘ఫీలింగ్ గుడ్’ అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దీనికి ఓ నెటిజెన్ స్పందిస్తూ.. ‘చైతూకి డివోర్స్ ఇచ్చెయ్యి..

మనం పెళ్లి చేసుకుందాం` అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి సమంత సమాధానమిస్తూ .. ‘కష్టం.. ఒక పని చెయ్.. చెయ్ ను అడుగు’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus