బట్టలకు లక్షలు పోస్తున్న సామ్‌

  • December 29, 2020 / 01:28 PM IST

హీరోయిన్‌ ఏదైనా డ్రెస్‌ వేస్తే దాని ధర ఎంత ఉంటుందనే విషయం మీద నెటిజన్లు ఆసక్తి నెలకొంటుంది. డ్రెస్‌ ధర ఇంత, వీరు డిజైన్‌ చేశారు, ఇంతకుముందు ఇలాంటి డ్రెస్‌ వేరే నాయిక వేశారు అంటూ చాలా వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి చర్చ సమంత వేసుకున్న డ్రెస్‌ గురించి నడుస్తోంది. క్రిస్మస్‌ సందర్భంగా ఆమె వేసుకున్న డ్రెస్‌ గురించే ఇదంతా. ఈ డ్రెస్‌ ధర లకారాలు ఉంటుందని అంటున్నారు.

సమంతకు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువే. ఫ్యాషన్‌తో ప్రయోగం ఎలా చేయాలో సామ్‌కు చాలా బాగా తెలుసు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ స్టేట్మెంట్ తో ఆకట్టుకుంటుంది. ఇటీవల ఓ ఫ్యాషన్‌ దుస్తుల అమ్మకం సంస్థ బ్రాండ్‌ ప్రమోషన్‌ గురించి ఓ వీడియో రూపొందించింది. అందులో రకరకాల డ్రెస్‌లు వేసుకొని… వయ్యారాలు వలకబోసింది. ఆ అందాల హ్యాంగోవర్‌ నుంచి నెటిజన్లు బయటకు రాకముందే కొత్త డ్రెస్‌తో మొన్న క్రిస్‌మస్‌ రోజు కనువిందు చేసింది.

కలర్ ఫుల్ స్కర్ట్, ఫ్రిల్ల్డ్ టాప్ తో సామ్‌ చూడముచ్చటగా ఉంది. పింక్‌, రెడ్‌, వైట్‌, బ్లాక్‌ కాంబినేషన్‌లో ఆ డ్రెస్‌ షాకింగ్‌ ధర తెలిసి నెటిజన్లు అమ్మో అనుకుంటున్నారు. దీని ధర అక్షరాల 3.5 లక్షల రూపాయలట. అవును మీరు చదివింది నిజమే. సమంతకు క్రిస్‌మస్‌ చాలా స్పెషల్‌ అనే విషయం మనకు తెలిసిందే. ఆ రోజు వేసే డ్రెస్‌ ఆ మాత్రం ధర ఉండాలి లెండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus