Samantha: పెళ్లి తర్వాత సమంతలో బోల్డ్‌నెస్‌ పెరిగిందా..!

  • July 5, 2021 / 10:02 AM IST

తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’లో పద్ధతిగా చీరకట్టు, సల్వార్ కమీజ్‌లతో అదరగొట్టింది సమంత. ఇలాంటి అమ్మాయి జీవితంలో దొరికితే చాలురా బాబూ.. జీవితం ధన్యం అనేలా కనిపించింది. ఆ ఫీల్‌లో కుర్రకారు ఉండగానే ‘బృందావనం’లో గ్లామర్‌ షోతో వావ్‌ అనిపించింది. సామ్‌తో మామూలుగా ఉండదు అని అనిపించుకుంది. అలా వరుసగా రెండు రకాల పాత్రలు చేస్తూ వచ్చింది. మధ్యలో సోషల్‌ మీడియాలో సందడి ఎలాగూ ఉంది. అయితే ఇదంతా పెళ్లి అయ్యేంత వరకు. పెళ్లయ్యాక సామ్‌లో చాలా మార్పు వచ్చింది.

పెళ్లి తర్వాత సామ్‌ చాలా మారింది. సినిమాల్లో పద్ధతిగా కనిపిస్తూ, సోషల్‌ మీడియాలోకి వచ్చేసరికి బోల్డ్‌నెస్‌ని పీక్స్‌లో చూపిస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో చూస్తే ఈ విషయం మీకే తెలిసిపోతుంది. వైట్‌ టాప్‌, బ్లాక్‌ జీన్‌లో సామ్‌ టూమచ్‌ హాట్‌ లుక్‌లో కవ్విస్తోంది. బ్యాక్‌లెస్‌ డ్రెస్‌లు వేయడం కొత్త కాకపోవచ్చు కానీ… అందులో ఫ్రంట్‌ కూడా కవ్విస్తూ చూపించడం ఈ బోల్డ్‌ డ్రెస్‌లో పాయింట్‌. ఇదంతా చూస్తుంటే ‘సమంత… మరీ ఇంతలా చూపించాలా’ అనడం తప్పేం కాదేమో.

సినిమాల విషయానికొచ్చేసరికి సమంత పెళ్లి అయ్యాక పద్ధతైన పాత్రలు, ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అన్నింటా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఉంది. మాస్‌ మసాలా, కమర్షియల్‌ సినిమాలు ఓకే చేయకుండా… పాయింట్‌ మీద నిలబడుతోంది. అయితే ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో మాత్రం సినిమా నియమం పక్కనపెట్టి… సోషల్‌ మీడియా రూల్‌ను ఒంటబట్టించుకుంది. సినిమా మిస్‌ అయిన ‘షో’ బయట చూపిస్తోందన్నమాట.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus