బాలీవుడ్ డ్రగ్ కేసుపై సమంత స్పందించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మర్డర్ మిస్టరీగా మారిన నేపథ్యంలో రియా చక్రవర్తిపై ఆరోపణలు వచ్చాయి. ఆమెపై ఈడీ కేసు పెట్టారు. తరవాత అది డ్రగ్ కేసుగా మారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి చేరింది. మాదకద్రవ్యాలు ( డ్రగ్స్) సేవించడం, లావాదేవీలు నిర్వహించడం వంటి నేరాలు చేసినందుకు గాను ఆమెను అరెస్ట్ చేశారు. రియాకి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
జైలులో వున్న ఆమెను విచారించినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, సైమన్ ఖంబట్టా సైతం డ్రగ్స్ తీసుకున్నారని చెప్పినట్టు నేషనల్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ ఒక న్యూస్ టెలికాస్ట్ చేసింది. వాళ్ళు ముగ్గురితో పాటు మొత్తం 25మంది బాలీవుడ్ సెలబ్రిటీల లిస్టును ఎన్సీబీ ప్రిపేర్ చేసిందని చెప్పింది. రకుల్ పేరు రావడంతో టాలీవుడ్ కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. అయితే, బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ ఏదీ ప్రిపేర్ చెయ్యలేదని… రకుల్, సారా పేర్లు లేవని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా తెలియజేశారు.
కెపిఎస్ మల్హోత్రా స్టేట్మెంట్ను సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. సారీరకుల్, సారీసారా హ్యాష్‌ట్యాగ్‌లు యాడ్ చేశారు. కవర్ పేజీ చూసి పుస్తకంపై అంచనాకు రావొద్దని ఒక నెటిజన్ చేసిన పోస్టును స్టోరీలో షేర్ చేశారు. సారీరకుల్ హ్యాష్‌ట్యాగ్ వున్న పోస్టులు సమంత ఇన్‌స్టా స్టోరీల్లో ఎక్కువ కనిపించాయి. రకుల్‌కి ఆమె ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా సారీరకుల్, సారీసారా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఫేక్ న్యూస్ అని సెలబ్రిటీలు నినదించారు.
Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!