జీ తెలుగు ప్రచార బాధ్యతలు తీసుకున్న సమంత!

  • December 20, 2017 / 12:30 PM IST

పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్స్ కెరీర్ ఆగిపోవడమే.. నెమ్మదించడమో జరుగుతుంది. అయితే సమంత నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నతర్వాత కెరీర్ మరింత ఊపందుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న రంగస్థలం, మహానటి సినిమాల షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది. ఇవే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తోంది. అందులో భాగంగానే కన్నడ మిస్టరీ సినిమా “యుటర్న్‌” రీమేక్ లో నటించడానికి సిద్ధమైంది. దీనిని నాగచైతన్యతో కలిసి తనే స్వయంగా నిర్మించనున్నట్టు తెలిసింది.

ఇవే కాకుండా తాజాగా మరో బాధ్యతని భుజాన ఎత్తుకుంది. అదే జీ తెలుగు ఛానల్ అంబాసిడర్ గా సంతకం చేసింది. ఇక నుంచి ఈ ఛానెల్ ని మరింతమంది  వీక్షకుల చెంతకు తీసుకెళ్లనుంది. ఇది వరకు జీ ఛానల్ కి మిల్కీ బ్యూటీ తమన్నా.. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. కొన్నేళ్లుగా ఆమె కొనసాగింది. తమన్నాను పక్కకు నెట్టి 2018 నుంచి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తి చేసినట్లు టీవీ వర్గాలు తెలిపాయి. దీనికి గాను సమంత కోటి 50 లక్షలు అందుకున్నట్టు టాక్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఛానెల్ లో పలు సీరియళ్లు, సినిమాలకు సమంత  ప్రచారం చేయనుంది. ఆమెపై షూట్ చేసిన ప్రకటనలు జనవరి ఒకటి నుంచి ప్రచారం కానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus