టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన గురించి తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను తెలియచేశారు.
గత రెండు సంవత్సరాలుగా సమంత ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సమంత జీవితంలో ఎదురైన ఇబ్బందులు కష్టాల గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తెలియజేశారు. నా జీవితంలో ఇప్పటివరకు ఏం జరిగింది? తాను ఎలా ఉన్నాను అనే విషయాలు అందరికీ తెలిసిందే. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. నా జీవితంలో చోటు చేసుకున్న ఎత్తు పల్లాలను పారదర్శకంగా అందరూ చూడవచ్చు.
కానీ కొందరిలో నేను ఏ విషయాలను దాచిపెట్టలేదు, జీవితంలో ఫేక్ గా ఉండటం నాకు ఇష్టం ఉండదు. నేను అలా అసలు ఉండలేను అంటూ ఈమె కామెంట్ చేశారు. ఈ విధంగా సమంత కొందరిలా నేను కొన్ని విషయాలను దాచి పెట్టలేను అంటూ చేసిన ఈ కామెంట్స్ నాగచైతన్య ఉద్దేశించే చేశారని పలువురు భావిస్తున్నారు.
ఇక నా (Samantha) జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా నిలబడి తట్టుకోగలిగానని నా జీవితంలో నేను అసలు ఊహించని పరిణామాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో చోటుచేసుకున్నాయని ఈ రెండు సంవత్సరాలలో నాకు ఎన్నో జీవిత పాఠాలు ఎదురయ్యాయని, ఈ సందర్భంగా సమంత చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!