దండం పెట్టిన సమంత

  • July 16, 2016 / 12:13 PM IST

టాలీవుడ్ క్యూట్ నటి సమంతకు ప్రస్తుతం ఏమి చేయాలో తెలియడం లేదు. ఆమె ప్రేమలో పడ్డానని చెప్పిన నాటి నుంచి ప్రతి రోజు ఏదో ఒక విషయం పై వార్తల్లో ఉంటోంది. అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలు అంటూ కొన్ని నెట్ లో కొన్ని హల్ చల్ చేయడం, కింగ్ నాగార్జున తన కొడుకు పెళ్లి అతను ప్రేమించిన అమ్మాయితో చేయడానికి అభ్యంతరం ఏమి లేదని చెప్పడంతో .. సమంత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ తమిళ పన్ను ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. షూటింగ్లో విరామ దొరకడంతో సొంత ఇంటికి వెళ్లినా ఆమెకు స్నేహితులు, అభిమానుల నుంచి ప్రశ్నలు ఆగడం లేదు.  జనతా గ్యారేజ్ తర్వాత సినిమాలో నటించవు అని చెబుతున్నారు.. నిజమేనా ?  అని రెండు రోజుల క్రితం అభిమానులు అడిగారు. అలాంటిది ఏది లేదు .. సినిమాలో నటిస్తాను అని ట్వీట్ చేసింది.

అయినా ఆమె ఫలానా సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు రాకపోవడంతో మీడియా ప్రజలు ఆమె స్టేట్ మెంట్ ని నమ్మడం లేదు. అంతే కాదు చైతూకి, సమంతకి ఈ ఏడాది సెప్టెంబర్ 23 న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని, హైదరాబాద్ లోని నోవాటెల్ లో వీరి వివాహం జరగనుందని వార్తలు ప్రచురించారు. ఈ న్యూస్ అందాల నటి వద్దకు చేరింది. “అలా ఎవరూ చెప్పలేదు” అని సమంత క్లారిటీ ఇచ్చింది. అభిమానులు మాత్రం ఇటువంటి వార్తలు రాసే వారిపై సెటైర్లు వేశారు. ఆమెకు సపోర్టుగా పోస్టులు చేశారు. “వెబ్ సైట్ల వాళ్లు మీ హానీ మూన్ షెడ్యూల్ కూడా ప్రకటించేశారు.. మీ పిల్లలకు పేర్లు కూడా ఇప్పుడే పెట్టేసేటట్టున్నారు” అని ఫ్యాన్స్ ట్వీట్ చేయగా అందుకు సమంత.. ఏమి చెప్పాలో తెలియక దండం పెట్టే ఐకాన్ లను పోస్ట్ చేసి తన అసహనాన్ని వెల్లడించింది. “ఈ సోదంతా ఎందుకు.. ఏదో ఒకటి తేల్చేయొచ్చుకదా” అని ఓ ఫాలోవర్ అడగగా.. “ఏదో ఒకటి ఉండాలి కదా డార్లింగ్ ” అంటూ సమంత తెలివిగా సమాధానమిచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus