తెగ వైరలవుతున్న సమంత ఫేవరెట్‌ పిక్స్‌ !

తన భర్త నాగ చైతన్యతో నటించిన ‘మజిలీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది సమంత. ఈ చిత్రంలో శ్రావణి పాత్రలో జీవించేసింది. నిజజీవితంలో కూడా శ్రావణి లాంటి భార్య వస్తే బాగుణ్ణు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతోనూ, మీమ్స్ తోనూ తెగ హల్ చల్ చేసారు నెటిజన్లు. అంటే ఆ పాత్ర ఎంతలా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ‘ఇక నిజ జీవితంలో కూడా తను శ్రావణి లాంటిదే… నేను చాలా అదృష్టవంతుడిని అంటూ నాగచైతన్య కూడా ‘మజిలీ’ సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు కూడా. అంటే తనని సమంత ఎంత బాగా చూసుకుంటుందనేది స్పష్టమవుతుంది.’

ఇదిలా ఉంటే.. తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన ఫేవరెట్‌ పిక్స్‌ ను అభిమానులతో పంచుకుంది సమంత. విక్టరీ వెంకటేష్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం గత నెలలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ వేడుకలో చైతన్య-సమంత దిగిన కొన్ని ఫోటోలను సమంత ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో పాటూ… ‘ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే నా శ్రీవారు జీవితాంతం అలాగే ప్రశాంతంగా బతకాలని ఆశపడ్డారు. కానీ దేవుడు మాత్రం నన్ను పంపించి ప్రతీకారం తీర్చుకున్నాడు’ అంటూ చైతన్యను ఉద్దేశించి కామెంట్ చేస్తూ.. దానికి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus