Samantha: సమంత ఇలా షాక్ ఇచ్చిందేటి..?

సెలబ్రెటీలు చాలా వరకు వారి ప్రతీ చర్య కూడా జనాల్లో హాట్ టాపిక్ అయ్యేలా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది బోల్డ్ గా వెళ్లే క్రమంలో ఊహించని విధంగా ఆహాక్ ఇస్తుంటారు. అయితే మొన్నటివరకు సోషల్ మీడియాలలో ప్రశాంతమైన కొటేషన్స్ తో మెప్పించిన సమంత రూత్ ప్రభు ఇటీవల మాత్రం తన టీ షర్ట్ పై ఏకంగా పచ్చి బుతులతో షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ లో F*ck you అనే పదాలను తన తెల్లని టీ షర్ట్ పై వేసుకొని ఫొటోగ్రాఫర్స్ ను సైతం ఆశ్చర్యపరిచింది.

ఇటీవల ముంబైకు వెళ్లిన సమంత అక్కడ బాంద్రాలోని ఒక సెలూన్ దగ్గర ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది. F**k you f**king f**k అంటూ రాయలేని పదాలతో షాక్ ఇచ్చింది. అసలు సమంత ఇంత నిర్మొహమాటంగా అలాంటి బూతులు ఉన్న టీ షర్ట్ తో దర్శనమిచ్చింది అంటే ఎవరికో కౌంటర్ ఇవ్వడానికి అయ్యి ఉంటుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత ఇటీవల విడాకులు తీసుకున్నప్పటి నుంచి కూడా చాలా బోల్డ్ గా దర్శనమిస్తోంది.పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ తో ఏ రేంజ్ లో దర్శనమిచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే ఒక హాలీవుడ్ రీమేక్ లో నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఆ ప్రాజెక్ట్ లో కూడా సమంత ఆశ్చర్యపరిచే విధంగా కనిపించబోతోంది. ఇక ఇన్స్టాగ్రామ్ లో కూడా గ్లామర్ డోస్ కూడా గట్టిగానే పెంచుతోంది.

ఆ మధ్య మొదటిసారి బికినిలో కనిపించి ఫొటో వైరల్ అయ్యేలా చేసింది. ఇక సమంత కొనసాగుతున్న తీరుతో ముందు ముందు ఇంకా ఆమె ఎలాంటి షాక్ లు ఇస్తుందో అని నెటిజన్లు అభిప్రాయం పడుతున్నారు. సమంత నెక్స్ట్ శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

1

2

3

4

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus