Samantha: స్టార్ హీరోయిన్ సమంత త్వరలో శుభవార్త చెప్పనుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఒకవైపు సినిమాలతో మరోవైపు యాడ్స్ తో కెరీర్ పరంగా బిజీగా ఉండి ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు. అయితే స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఒంటరిగా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. చైసామ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోవడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. చైసామ్ విడిపోయిన తర్వాత ఒకే వేదికపై కలిసి కనిపించలేదనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సింగిల్ గా జీవనం సాగిస్తున్న సామ్ మళ్లీ ప్రేమలో పడిందనే అనుమానాన్ని ఫ్యాన్స్ కు కలిగిస్తున్నారు. సామ్ గత సినిమాలలో యశోద సినిమా అబవ్ యావరేజ్ గా శాకుంతలం సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలవడం గమనార్హం. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సమంత ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న సమంత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రేమ గురించి స్టేటస్ లు పెడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఎక్కువ ద్వేషించే మాటలు, మనుషులు చూసి ఉంటావేమో కానీ ఈ ప్రపంచంలో మనం ఉహించిన దాని కంటే ఎక్కువ ప్రేమ ఉంటుందని సామ్ చెప్పుకొచ్చారు. సామ్ చేస్తున్న పోస్ట్ ల వల్ల సమంత ప్రేమలో ఉన్నారేమో అని అనుమానాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ కామెంట్ల గురించి సమంత ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

సమంత (Samantha) మయోసైటిస్ నుంచి కోలుకుని సినిమాలతో బిజీ కావాలని ఆమె రెమ్యునరేషన్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. సమంత కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ తీసుకోవడం గమనార్హం.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus