Samantha: బ్లాక్‌ డ్రస్ లో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేసిన స్టార్ హీరోయిన్ సమంత..!

  • July 13, 2023 / 05:41 PM IST

సమంత హీరోయిన్‌ గా ఆమె తొలి సినిమాతోనే పాపులర్‌ అయ్యింది. `ఏం మాయ చేసావె` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకుంది. అందరి మనసులు దోచుకుంది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అత్యంత సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్‌ సిరీస్‌ ఆమెకి పాన్‌ ఇండియా ఇమేజ్‌ని తీసుకొచ్చింది. దీంతో నార్త్ నుంచి ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ తర్వాత మొదటి సారి మీడియా కంట పడింది. కెమెరా కన్నులకు చిక్కింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. (Samantha) సమంత తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించింది. అందమైన హీరోయిన్లకి బ్లాక్‌ డ్రెస్‌ అనేది డెడ్లీ కాంబినేషన్‌. అందులో ఈ అందాల భామల్ని చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. తాజాగా సమంత కూడా బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్ చేస్తుంది. బాడీ షేపులు కనిపించేలా టైట్‌ ఫిట్‌లో కత్తిలాగా ఉంది సమంత. ముంబయిలో మెరిసింది సమంత. ఆమె వరుణ్‌ దావన్‌తో కలిసి `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది.

ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఆమె ముంబయికి వెళ్లింది. అక్కడి మిగిలిన షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా షూటింగ్‌ ప్రదేశంలో సమంత కెమెరాకి చిక్కింది. సమంత ఇటీవల ఏడాది బ్రేక్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆమె బ్రేక్‌ తీసుకుంటున్నట్టు తెలిపింది. గతంలో సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన విషయం తెలిసింది. దాన్నుంచి కోలుకుని తెలుగులో `ఖుషి` షూటింగ్‌లో పాల్గొంది.

అదే సమయంలో `సిటాడెల్‌` షూటింగ్‌లోనూ పాల్గొంది. `ఖుషి` షూటింగ్‌ పూర్తి చేసుకుంది. మరోవైపు సిటాడెల్‌ చిత్రీకరణ కూడా పూర్తి చేసే పనిలో పడింది. దీని తర్వాత ఆమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతుంది. కొత్తగా ఆమె దేనికి కమిట్‌ కాలేదని పీఆర్‌ టీమ్‌ తెలిపింది. ఈ లెక్కన ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఉండబోదని తెలుస్తుంది. ఇక సమంత కెరీర్‌ పరంగా అనేక స్ట్రగుల్స్ ఫేస్‌ చేసింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus