హల్ చల్ చేస్తున్న సమంత, నాగార్జున మధ్య మాటలు

  • May 19, 2017 / 05:57 AM IST

ఇప్పటి వరకు నాగచైతన్య, సమంత ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసాం. తొలిసారిగా నాగార్జున, సమంతల ట్వీట్స్ వైరల్ అయ్యాయి. చైతూ, సమంతలు ప్రేమించుకొని నిశ్చితార్ధం చేసుకున్నారు. త్వరలోనే సమంత అక్కినేని వారింటి కోడలు కాబోతోంది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికే అక్కినేని సమంత అని పిలవడం మొదలుపెట్టారు. ఇదివరకు నిశ్చితార్థం పూర్తయ్యాక నాగార్జునని ఏమని పిలుస్తున్నారు? అని పలువురు అభిమానులు సమంతని అడిగినప్పుడు.. ఇంకా ఏమీ అనుకోలేదని సమంత సమాధానమిస్తూ వచ్చింది. అయితే తాజాగా వాళ్లిద్దరూ ఎలా మాట్లాడుకొంటారనే విషయాన్ని నాగార్జున స్వయంగా ట్విట్టర్‌ ద్వారా బయట పెట్టారు.

తన పెద్దకొడుకు నాగ చైతన్య హీరోగా నటించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుండటంతో సమంతకి ‘కంగ్రాట్స్‌ కోడలా’ అని వాట్సప్‌లో నాగార్జున మెసేజ్ పంపారు. అది చూసిన సమంత ‘నాకూ బాగా నచ్చింది మామా. చాలా సంతోషంగా ఉంది. తను (నాగ చైతన్య) సూపర్‌గా కనిపిస్తున్నాడు. తప్పకుండా విజయం సాధిస్తుంది’ అంటూ సమంత రిప్లై ఇచ్చింది. ఆ సంభాషణకి సంబంధించిన స్క్రీన్ షాట్ ని ట్విట్టర్‌లో నాగ్ పోస్ట్ చేశారు. మామాకోడళ్ల ముచ్చట్లని నెటిజన్లు, అక్కినేని అభిమానులు ఆసక్తిగా చదివారు. విపరీతంగా షేర్లు చేయడంతో వైరల్ అయింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus