Oh Baby: మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న ఓ బేబీ… విడుదల ఎప్పుడంటే?

  • March 7, 2023 / 05:29 PM IST

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సెలబ్రిటీలకు పుట్టినరోజులు రావడం లేదా దర్శకుల పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్లో సూపర్ హిట్ సాధించినటువంటి సినిమాని తిరిగి విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు తిరిగి విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి సమంత నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ఓ బేబీ సినిమా కూడా తిరిగి విడుదలకు సిద్ధమైంది.

సమంత యూటర్న్ సినిమా ద్వారా లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పెద్దగా ఆదరణ సంపాదించుకోలేకపోయిన అనంతరం నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి ఓ బేబీ సినిమా మాత్రం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్‌ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2019 జులై 5వ తేదీ విడుదలైంది.

ఇందులో సమంత నటన అద్భుతమని చెప్పాలి.ఈ సినిమా హిట్ అవడంతో ఎంతో మంది దర్శక నిర్మాతలు సమంతతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విధంగా సమంత కెరీర్ లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమాని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేశారు. పీవీఆర్‌, ఐనాక్స్ థియేటర్లలోనే ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.

స్త్రీల నిజమైన అందం, శక్తిని సెలబ్రేట్‌ చేసుకోవడానికి `ఓ బేబీ` ని స్క్రీన్‌లపై చూడటం కంటే మెరుగైన మార్గం మరోటి లేదు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పివిఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రదర్శించబడుతుందని మేకర్స్ వెల్లడించారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus