యూటర్న్ విషయంలో సమంత నిర్ణయం ఫిక్స్!

  • December 2, 2017 / 07:53 AM IST

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత పెళ్లి అయిన తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి హనీమూన్ వెళ్లకుండా.. సినిమా సెట్స్ చుట్టూ తిరుగుతోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన రంగస్థలం 1985 మూవీ చేస్తోంది. మహానటి మూవీలోని అలనాటి నటి జామున పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది. ఇంత బిజీగా ఉన్నప్పటికీ రీసెంట్ గా మరో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. ఇంతవరకు సమంత ఒక్కతే సినిమాని మోయలేదు. తొలిసారి ఆ బాధ్యతలు తీసుకుంటోంది. కన్నడ మిస్టరీ సినిమా “యుటర్న్‌” రీమేక్ లో నటించడానికి సిద్ధమైంది.

2016లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శ్రద్ధా శ్రీనాథ్‌, రోగర్‌ నారాయణ్‌, దిలీప్‌ రాజ్‌, రాధికా చేతన్‌ ల నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రద్ధా శ్రీనాథ్‌ పోషించిన జర్నలిస్ట్  పాత్రలో  సమంత కనిపించనుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని భర్త నాగచైతన్యతో కలిసి ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. కన్నడ వెర్షన్ కి దర్సకత్వం వహించిన పవన్‌కుమార్‌ నే ఇందుకు డైరక్టర్ గా తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి… అన్ని పూర్తి అయిన వెంటనే మూవీ వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus