Samantha: వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నా సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • July 28, 2023 / 06:00 AM IST

సమంత ఇప్పుడు వెకేషన్ లో వుంది. ఆమధ్య కొత్త సినిమాలు కొన్నాళ్ల పాటు ఒప్పుకోను, వున్నవి పూర్తి చేసి, కొన్ని నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పిన సమంత అదే పని చేస్తోంది. విజయ్ దేవరకొండ తో ‘ఖుషీ’ సినిమా పూర్తి చేసేసింది, అలాగే వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా చేతిలో కొత్త సినిమాలు ఏమీ లేవు, అలాగే ఏమీ ఒప్పుకోలేదు కూడా. తన స్నేహితురాలు అనూష స్వామి తో కలిసి బాలి పట్టణంలో తిరుగుతోంది.

కొన్ని రోజుల నుండి బాలి లో వున్న మంచి ప్రదేశాలు అన్నిటినీ తన ఫోన్ లో బందిస్తూ వాటిని తన సాంఘీక మాధ్యమాల్లో పెడుతూ వస్తోంది సమంత. ఈరోజు ఇంకొక ఆసక్తికరమైన ఫోటోస్ షేర్ చేసింది సమంత. బాలి లోని కోతుల ఫారెస్ట్ కి వెళ్లిన ఈ ఇద్దరూ స్నేహితులు అక్కడ కోతులతో బాగానే ఆడుకున్నట్టుగా కనిపిస్తోంది.

బాలిలో ఈ కోతుల అడవి చాలా ప్రాముఖ్యం కలది అని కూడా తెలుస్తోంది. మామూలుగా ప్రకృతి అందాలని చూడటానికి వచ్చినవాళ్లు ఈ కోతుల ఫారెస్ట్ కి ముందుగా వెళతారు. సమంత ప్రస్తుతం సినిమాలు ఏమీ చేతిలో లేకుండా, కేవలం రెస్ట్ తీసుకోవాలని ఇండోనేషియా వెళ్లినట్టుగా కనపడుతోంది. సమంత కి మయోసిటిస్ అనే వ్యాధి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ వ్యాధి తగ్గుముఖం పట్టగానే సమంత వెంటనే తను మధ్యలో వదిలేసిన సినిమాలని పూర్తి చెయ్యాలన్న తలంపుతో విశ్రాంతి లేకుండా పని చెయ్యడంతో ఆ వ్యాధి మళ్ళీ ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో వున్న సినిమాలని పూర్తి చేసి, ఇలా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. అందుకే ఇండోనేషియా లోని బాలి పట్టణంలో గత కొన్ని రోజులుగా తిరుగుతూ ఈరోజు ఇలా కోతులతో వున్న ఫోటోస్ పెట్టింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus