Samantha: సమంత వింటేజ్ లుక్ చూశారా..వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో..!

  • July 26, 2022 / 10:52 AM IST

సమంత గ్లోబల్ స్టార్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది. అందుకోసం బాలీవుడ్, హాలీవుడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఇప్పుడు విపరీతమైన స్కిన్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె వరుసగా గ్లామర్ రోల్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ ‘యశోద’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

వీటితో పాటు బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి కూడా సమంత ప్లాన్ చేసుకుంటోంది. అందుకోసం వరుసగా కథల్ని వింటుంది కానీ అవి ఆమెకు నచ్చడం లేదు. అలా అని గ్లామర్ ఫోటో షూట్లను పక్కకు పెట్టడం లేదు. అక్కడి మ్యాగ్జైన్ ల కోసం విపరీతంగా అందాలు ఆరబోస్తుంది. ఇదిలా ఉండగా.. సమంత కి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సమంత గుర్తుపట్టలేని విధంగా ఉంది.

అయితే ఇది లేటెస్ట్ వీడియో కాదు.. 12 ఏళ్ళ క్రితం వీడియో అని తెలుస్తుంది. ‘ఏమాయ చేసావే’ సినిమా ప్రమోషన్ల టైంలో సమంత పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో ఇదని స్పష్టమవుతుంది. గతంలో సమంత తన మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ విషయం పై ఆమె ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ ఈమె వింటేజ్ పిక్స్ కొన్ని చూస్తే అది నిజమే అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. తాజా వీడియో కూడా అందుకు సింబాలిక్ గానే ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus