యాక్షన్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది దీని క్యాప్షన్.నూతన దర్శకుడు తు.పా.శరవణన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విశాల్ తన సొంత బ్యానర్ అయిన ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ (VFF) పై నిర్మించాడు. ఫిబ్రవరి 4న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో జోరు చూపించలేకపోతుంది. వీకెండ్ వరకు ఓకె అనిపించిన ఈ చిత్రం సోమవారం నుండీ డౌన్ అయ్యింది.
ఒకసారి 5 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.39 cr |
సీడెడ్ | 0.31 cr |
ఉత్తరాంధ్ర | 0.23 cr |
ఈస్ట్ | 0.19 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.17 cr |
కృష్ణా | 0.12 cr |
నెల్లూరు | 0.09 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.61 cr |
‘సామాన్యుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.61 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది కష్టమనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో విశాల్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ఓపెనింగ్స్ వరకు ఓకె అనిపిస్తున్నా..
తర్వాత ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతుండడం గమనార్హం. పైగా గతేడాది విశాల్ నుండీ వచ్చిన ‘చక్ర’ ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో రిలీజ్ అయ్యింది. ఇక ‘ఎనిమి’ కూడా నవంబర్ వంటి డ్రై సీజన్లోనే రిలీజ్ అవ్వగా.. ‘సామాన్యుడు’ కూడా ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లోనే రిలీజ్ అయ్యింది. అందుకే ఫలితం తేడా కొట్టిందని ట్రేడ్ పండితుల అంచనా.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!