మహేష్, మురుగదాస్ మూవీకి ఆ పేరు పెట్టరు

  • March 14, 2017 / 09:18 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ టైటిల్ పై చర్చ జరుగుతోంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ  ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీకి మొదట్లో వాస్కోడిగామా, స్టన్ గన్, ఎనిమీ, ఏజెంట్ శివ, అభిమన్యు అని పేర్లు వినిపించాయి. కొన్ని రోజుల క్రితం సంభవామి అనే పేరు ప్రచారం లోకి వచ్చింది. సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత పీవీపీ ఆ చిత్ర ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గురించి మాట్లాడుతూ ‘ఠాగూర్ మధు ఈ ఏడాది మిస్టర్, విన్నర్, సంభవామి యుగే యుగే అనే మూడు సినిమాలు చేస్తున్నారు. అన్నీవిజయవంతమవ్వాలి’ అన్నారు.

దీంతో మహేష్ చేస్తున్న సినిమా పేరు ‘సంభవామి యుగే యుగే’ అని అందరూ అనుకున్నారు. కానీ ఈ పేరుని మహేష్ అంగీకరించరని అతని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎందుకంటే. నాలుగేళ్ల క్రితం ఇదే పేరుతో తెలుగు సినిమా వచ్చింది. ఈ చిత్ర నిర్మాణంలో డైరక్టర్ క్రిష్ కి భాగస్వామ్యం ఉంది. ఈ సినిమాకి సరైన ప్రమోషన్ లేక రిలీజ్ అయినట్లు కూడా చాలామందికి తెలియదు. కావున ఇలా వచ్చేసిన మూవీ పేరుని తన చిత్రానికి ప్రిన్స్ పెట్టుకోరని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సూపర్ స్టార్ తొలి సారి చేస్తున్న ద్విభాషా చిత్రానికి ఏ పేరు పెడుతారోనని తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ వర్గాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus