‘మైనే దిల్ తుజ్ కో దియా’ అనే బాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమీరారెడ్డి. తరువాత బి.గోపాల్ డైరెక్షన్లో జూ.ఎన్టీఆర్ నటించిన ‘నరసింహుడు’ అనే చిత్రంతో టాలీవుడ్ కి కూడా పరిచయమయ్యి … ‘అశోక్’ ‘జై చిరంజీవ’ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. 2014లో అక్షయ్ వాద్రాని పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలకి దూరంగా ఉంటూ వస్తుంది సమీరా. 2015 లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన సమీరా ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది సమీరా.
అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోని షేర్ చేసింది సమీరా. ప్రస్తుతం గర్భిణి కాబట్టి ఆ ఫొటోలో కొంచెం లావుగా కనిపించింది. ఇదిలా ఉండగా కొందరు అభిమానులు ఆమె శరీరాకృతి గురించి కామెంట్స్ చేయడం సమీరాకి కోపం తెప్పించింది. ‘బాగా లావు అయిపోయావు. నువ్వు ఒకప్పుడు హీరోయిన్‌వి అంటే నమ్మలేకుండా ఉన్నామంటూ’ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో ఆమె గట్టిగా క్లాస్ పీకింది.”మీకో ప్రశ్న. మీరు పుట్టిన తర్వాత కూడా మీ అమ్మ హాట్‌గానే ఉందా?,” అంటూ ఘాటుగా స్పందించింది. “ఇప్పుడు నేను మళ్ళీ తల్లిని కాబోతున్నాను. బరువు తగ్గడానికి కొంత సమయం పట్టొచ్చు. అందరి శరీరాకృతీ ఒకేలా ఉండదు. కరీనా లాంటివారు తల్లి అయిన తర్వాత కూడా అందంగా కనిపిస్తారు. అందరూ కరీనాలు కాలేరు కదా… మీకు ఇలా పిచ్చి పిచ్చిగా వాగే సత్తా మాత్రమే ఉంటుంది. నాకు చాలా శక్తి ఉంది. నేను ఓ బిడ్డకు జన్మనివ్వగలను” అంటూ ఆ నెటిజన్ల పై మండిపడింది సమీరా.