టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమీరారెడ్డి తక్కువ సినిమాలే చేసినా స్టార్స్ ప్రాజెక్ట్ లలో ఎక్కువగా నటించిన సంగతి తెలిసిందే. జై చిరంజీవ, నరసింహుడు, అశోక్ మరికొన్ని సినిమాలలో సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడం గమనార్హం. ఈ సినిమాలు సక్సెస్ సాధించి ఉంటే సమీరా రెడ్డి తెలుగులో మరిన్ని ఆఫర్లతో బిజీగా ఉండేవారని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. అయితే సమీరా రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన అవమానాల గురించి ఇతర విషయాలకు సంబంధించి షాకింగ్ నిజాలను వెల్లడించారు. మహేష్ హీరోగా తెరకెక్కిన ఒక సినిమా అడిషన్ కు తాను వెళ్లగా తనకు అవమానం జరిగిందని ఆమె కామెంట్లు చేశారు. ఆ సినిమా అడిషన్ లో జరిగిన అవమానం వల్ల తాను ఏడ్చుకుంటూ వచ్చేశానని సమీరా రెడ్డి కామెంట్లు చేశారు. నా ఫస్ట్ మూవీ అడిషన్ 1988లో జరిగిందని ఆ మూవీ మహేష్ మూవీ కాగా ఆ సమయంలో నాకెంతో భయం వేసిందని సమీరా రెడ్డి పేర్కొన్నారు.
వాళ్లు ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయలేక ఏడుస్తూ ఇంటికి వెళ్లానని సమీరా రెడ్డి వెల్లడించారు. అప్పటివరకు చేసిన జాబ్ లో కొనసాగాలని నేను భావించానని ఆమె కామెంట్లు చేశారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చానని సమీరా రెడ్డి వెల్లడించారు. రాజకుమారుడు సినిమాకు ఈమెను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
పెళ్లి తర్వాత ఈ హీరోయిన్ సినిమాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు. సమీరారెడ్డి రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమీరా రెడ్డి రాబోయే రోజుల్లో సినిమాల్లోకి వస్తారో లేదో చూడాల్సి ఉంది సమీరారెడ్డికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!