Sampath Nandi, Chiranjeevi: సంపత్ చిరు కాంబోలో మూవీ వస్తుందా?

  • September 14, 2021 / 09:08 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో సంపత్ నంది ఒకరు. సీటీమార్ తో సంపత్ నంది మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవడంతో సంపత్ నంది కొత్త సినిమా ప్రకటన కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంపత్ చిరంజీవికి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. సంపత్ మెగాస్టార్ కోసం తను రిజిష్టర్ చేయించిన గాడ్ ఫాదర్ టైటిల్ ను సైతం త్యాగం చేశారు. ప్రస్తుతం సంపత్ చిరంజీవి కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

స్క్రిప్ట్ పనులు పూర్తైన తర్వాత సంపత్ ఆ కథను చిరంజీవికి చెబుతారని సమాచారం. ప్రతిభ ఉన్న డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్న చిరంజీవి సంపత్ నందికి కూడా ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. రచ్చ సినిమా నుంచి సంపత్ చిరంజీవితో ఒక సినిమా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కు రచ్చ మూవీతో సంపత్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన కథతో సంపత్ నంది చిరంజీవిని ఇంప్రెస్ చేస్తే మాత్రం మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ ను దాదాపుగా కొట్టేసినట్టే అని చెప్పవచ్చు.

చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది చిరంజీవి నటించిన రెండు సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆచార్య రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొనగా త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus