సోషల్ మీడియా లో ప్రముఖుల దగ్గర నుండి సామాన్యుల వరకు ఎవ్వరని వదలకుండా వాళ్ళ పైన కామెంట్స్,సటైర్స్,పంచ్ లు వదిలే వర్మకి ఒక అప్ కమింగ్ స్టార్ తల తిరిగే పంచ్ వేసాడు.అంత ధైర్యం ఎవరికుందా అని అనుకుంటున్నారా అతనే బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు.నిజమండి బాబు నమ్మలేకపోతున్నర కావాలంటే వివరాలు చూడండి.
తెలుగులో ‘వంగవీటి’ తన ఆఖరి సినిమా అని ప్రకటించిన వర్మ పై సంపూ తనదైన శైలిలో సటైర్ వేసాడు.
వర్మ ఇలాంటి ప్రకటనలు చేయడం మామూలేనని.., గతంలో ‘గోవింద’ చిత్రానికి కూడా సెన్సార్ కట్స్ ఎక్కువగా చేస్తున్నారని కోపంతో తెలుగులో ఇక సినిమాలు చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన చూస్తే వర్మ చివరి చిత్రం గోవింద అవ్వాలని సెటైర్ వేసాడు.వర్మతో మనకెందుకులే తల నొప్పి అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్న సంపూర్నేష్ బాబు ఎందుకో ధైర్యంచేసాడని రేపు దీనికి వర్మ ఎలాంటి కౌంటర్ వేస్తాడో అని అందరు ఉత్కంటతో ఎదురు చూస్తున్నారు.