Sampoornesh Babu: క్యాలీఫ్లవర్ పని పూర్తి చేసిన సంపూర్ణేష్ బాబు

Advertisement

బర్నింగ్ స్టార్ గా తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంపూర్ణేష్ బాబు చాలా రోజుల తరువాత ఒక సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఏకంగా శ్రీకృష్ణ అవతారంలో కనిపించి సోషల్ మీడియాలో రాబోయే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విబిన్నమైన సపోర్టింగ్ రోల్స్ కూడా ఆకట్టుకున్న సంపూ ఈసారి బాక్సాఫీస్ వద్ద తనదైన శైలిలో మరో హిట్ కొట్టాలని ప్లాన్ వేశాడు.

రీసెంట్ గా సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్ అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ఇక షూటింగ్ పూర్తయ్యినట్లు క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ సంపూని శ్రీకృష్ణుడి అవతారంలో చూపించారు. ఆ పోస్టర్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక త్వరలోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంపూర్ణేష్ బాబు మహాత్మ సినిమాలో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

ఇక ఆ సినిమా తరువాత అనుకోకుండా వచ్చిన హృదయ కాలేయం సినిమాతో ఊహించని విదంగా బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఇక చాలా గ్యాప్ అనంతరం కొబ్బరిమట్ట సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ తన మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు క్యాలీఫ్లవర్ తో హిట్ కొట్టాలని చూస్తున్న సంపూర్ణేష్ బాబు ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus