Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి బాలికపై అతి క్రూరంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కాసేపటికే సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి. రణ్‌బీర్‌ కపూర్‌ – సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందిన ‘యానిమల్‌’ సినిమాలోని ఓ సీన్‌ని తెగ ట్రెండ్‌ చేశారు. ఆ సీన్‌ని, ఈ ఘటనను పోలుస్తూ కొన్ని కామెంట్లు కూడా చేశారు. దీనిపై సందీప్‌ రెడ్డి వంగా రియాక్ట్‌ అయ్యారు. దాంతోపాటు ట్రోలింగ్‌కి కూడా గురయ్యారు. ఏమైందంటే?

Sandeep Vanga

‘యానిమల్‌’ సినిమాలో తన సోదరిని ర్యాగింగ్‌ చేసిన వారికి వార్నింగ్‌ ఇవ్వడానికి కాలేజ్‌లోకి ఏకంగా గన్‌ తీసుకుని వెళ్తాడు చిన్నప్పటి హీరో. రాప్తాడు ఘటన కూడా ఇలాగే ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి అత్యంత హేయమైన నేరానికి పాల్పడినప్పుడు మనం బాధితుల పట్ల సానుభూతి చూపించాలి. వారికి అండగా నిలబడాలి. ఆ సమస్యకు దారి తీసిన కారణాలు, పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటూ సూచించారు.

ప్రతి విషయానికీ సినిమాను లింక్‌ చేసి.. సినిమానే బలిపశువుగా చూపించడం సరికాదు. ఇతరుల విజయాన్ని చూసి ఓర్వలేని పరాన్నజీవులు ఒక విషాద సంఘటన జరిగినప్పుడు, దానిని అవకాశంగా మలుచుకుంటారు. ఇతరుల సినిమాలపై బురద చల్లడానికి సిద్ధమవుతారు అని ఆ పోస్టులో సందీప్‌ రెడ్డి వంగా పోస్ట్‌ పెట్టారు. ‘యానిమల్‌’ సినిమా మీద ఎక్కడ ఎన్ని పోస్టులు వచ్చినా.. అందరికీ తెలియలేదు. ఇప్పుడు సందీప్‌ వంగా రియాక్ట్‌ అయ్యేసరికి వాటి గురించి వెతికి మరీ చూస్తున్నారు.

పనిలో పనిగా తమ అక్కసునో, కోపాన్నో వెళ్లగక్కుతున్నారు. దీంతో అనవసరంగా ఆయన రియాక్ట్ అయ్యారు డిస్కషన్‌ కూడా నడుస్తోంది. అందులోనూ సినిమాలో హీరో పాత్ర స్కూల్లో ఎలాంటి హత్యలు, దాడులు చేయలేదు. కానీ రాప్తాడు ఘటనలో నిందితుడు దారుణంగా ప్రవర్తించి, గాయపరిచి ప్రాణాల మీదకు తెచ్చాడు. కాబట్టి రెండు విషయాలకూ చాలా తేడా ఉంది అని సందీప్‌ వంగా అభిమానులు అంటున్నారు.

5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus