టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఏది మాట్లాడినా సంచలనమే. అతను ఎంచుకునే కథలే కాదు, ఇంటర్వ్యూలలో ఇచ్చే ఆన్సర్స్ కూడా చాలా బోల్డ్‌గా ఉంటాయి. తాజాగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘ఎపిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన సందీప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) హీరోలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎపిక్ సినిమా టీజర్‌లో “శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ వంగా (Sandeep Reddy Vanga) సినిమాలో హీరో లాంటి అమ్మాయికి జరిగే కథ” అనే ఓ క్రేజీ డైలాగ్ ఉంది. ఈవెంట్‌లో యాంకర్ సుమ ఇదే డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. “ఆ డైలాగ్ వినగానే మీకెలా అనిపించింది?” అని సందీప్‌ను అడిగింది. దానికి అతను తనదైన స్టైల్‌లో స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇచ్చారు. “నాకు శేఖర్ కమ్ముల హీరోలు సీరియస్‌గా నచ్చరు. కానీ ఆయన సినిమాల్లో హీరోయిన్స్ మాత్రం చాలా బాగుంటారు. ఇక ఇందులో నా సినిమాలో హీరో క్యారెక్టర్ లాంటి హీరోయిన్ అనగానే.. ఏం చేస్తారో చూడాలనిపించింది” అంటూ సమాధానం ఇచ్చారు.
ఇక సుమ కంటిన్యూ చేస్తూ.. “మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి?” అని అడగగా.. వెంటనే “మేమిద్దరం (విజయ్ దేవరకొండ – సందీప్) కలిసి ‘అర్జున్ రెడ్డి’ తీశాం కదా.. అదే నా సమాధానం” అని చెప్పారు. “మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన లవ్ స్టోరీ ఏంటి?” అన్న ప్రశ్నకు సందీప్ (Sandeep Reddy Vanga) ‘గీతాంజలి’ అని ఆన్సర్ ఇచ్చారు.
సందీప్ వంగా (Sandeep Reddy Vanga) సినిమాల్లో హీరోలు ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమాల్లో హీరోలు అంత సాఫ్ట్‌గా ఉంటారు. కాబట్టి సందీప్ ఆన్సర్‌లో ఏమాత్రం ఆశ్చర్యం లేదని నెటిజన్లు అనుకుంటున్నారు. ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. మరోవైపు సందీప్ వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ తీస్తున్నారు.