బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అందరికీ శుభవార్త చెప్పాడు. ఇప్పటి వరకూ క్యాన్సర్తో పోరాడుతూ వచ్చిన ఆయన మొత్తనికి విజయం సాధించాడట. సంజయ్ దత్తే ఈ విషయాన్ని.. స్వయంగా ప్రకటించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగష్ట్ నెలలో సంజయ్ దత్ అస్వస్థతకు గురవ్వడంతో హాస్పిటల్ లో చేర్చారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా టెస్ట్ చేశారు. రిపోర్ట్స్ లో నెగెటివ్ అని వచ్చింది. అయితే తదుపరి పరీక్షల్లో ఈయనకి లంగ్ క్యాన్సర్ అని తేలింది.
అందులోనూ అది మూడో దశ అనగానే సంజయ్ దత్ అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో సంజయ్ దత్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ముంబైలోని హాస్పిటల్లో జాయినయ్యాడు. అటు తరువాత దుబాయ్లో కూడా కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు. ఈ మధ్యనే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్లో పాల్గొంటున్నట్టు ప్రకటించిన సంజు .. ఇప్పుడు క్యాన్సర్ నుండీ పూర్తిగా బయటపడినట్టు తెలిపాడు. ‘దేవుడు గొప్ప యోధులకు మాత్రమే కష్టమైన పోరాటాలని ఇస్తాడు..
నేను కూడా అలాగే పోరాడి ఈ యుద్ధంలో విజయం సాధించాను.నా పిల్లల పుట్టిన రోజు నాటికి నేను పూర్తి ఆరోగ్యవంతుడిని కావడమే కానుక’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ దత్.