ఇరుగుపొరుగును ఇబ్బందికి గురి చేస్తున్న సంజు బాబా!

  • April 19, 2016 / 05:26 AM IST

బాలీవుడ్ జనాలు “సంజు బాబా” అని ఎంతో ప్రేమతో పిలుచుకొనే సంజయ్ దత్ ఇటీవలే జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి వచ్చిన దగ్గరనుంచి రోజూ ఏదో ఒక పార్టీ ఎరేంజ్ చేస్తూనే ఉన్నాడు సంజయ్ దత్. అన్నీ లేట్ నైట్ పార్టీలే. మొదట్లే “పోన్లే చాన్నాళ్ళ తర్వాత కదా” అని ఊరుకొన్నారు ఇరుగుపొరుగు జనాలు.

అయితే గత రాత్రి మాత్రం కాస్త శృతి మించాడట సంజయ్ దత్. మిడ్ నైట్ పార్టీ ఏర్పాటు చేసి దాదాపు ఉదయం 4 గంటల వరకూ ఫుల్ సౌండ్ తో డిజే ప్లే చేస్తూనే ఉన్నాడట. దాంతో.. పక్కింట్లో ఉండే ఓ లేడీ డాక్టర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట. పోలీసులు వచ్చి పార్టీ ఆపుజేయడంతోపాటు.. సంజయ్ కి మళ్లీ రిపీట్ చేయోద్దంటూ చిన్నసైజు వార్నింగ్ కూడా ఇచ్చారంట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus