‘బుజ్జిగాడు’ బ్యూటీ సంజనా గల్రానీ ఇప్పుడు నిండు గర్భవతి.అతి త్వరలో ఈమె ఓ బిడ్డకి తల్లి కాబోతుంది. దీంతో ఈమె స్నేహితులు కొంతమంది ఈమెకు సీమంతం చేసారు. ఈ విషయాన్ని సంజన చెప్పుకొచ్చింది. ‘ఒక్కోసారి కుటుంబం కంటే స్నేహితులే నయమనిస్తుంది.నా పై ప్రేమతో నా సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి మరీ నాకు సీమంతం చేశారు. 9వ నెలలోకి ప్రేవేశిస్తున్నా. ఇంకో నెల రోజుల్లో నా బిడ్డను చూస్తాను.
నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. 2021 జనవరిలో ఈమె చిరకాల మిత్రుడు డాక్టర్ పాషాను రహస్య వివాహం చేసుకుంది సంజన. కొన్నాళ్ల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి సంజన సీమంతం ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :