టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంతోష్ శోభన్ హిట్టూ, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈయన నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని మంచి శకునమల సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా మే 18 వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సంతోష్ ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ…నేను హీరో అయిన తర్వాత మొదటి చెక్కు అందుకున్నది ప్రియాంక దత్ నుంచెనని ఈ సందర్భంగా తెలిపారు.పేపర్ బాయ్ తర్వాత తనకు చాలా గ్యాప్ వచ్చిందని అయితే తాజాగా అన్ని మంచి శకునములే అనే ఒక మంచి సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నానని తెలియజేశారు.
నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమా చూసిన తర్వాత తనతో కలిసి పని చేయాలని అనిపించింది. అలా మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడానికి ఎంతో సమయం పట్టిందని ఈ సందర్భంగా సంతోష్ తెలియజేశారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని ఈయన తెలియజేశారు. ఏక్ మినీ కథ నుంచి ఇప్పటివరకు తాను చేసిన సినిమాలు అన్నీ కూడా తను బరువు మోసే పాత్రలో నటించానని అయితే ఈ సినిమాలో మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉండే పాత్రలలో నటించాలని సంతోష్ వెల్లడించారు.
ఇక మదర్స్ డే సందర్భంగా సంతోష్ (Santosh Sobhan) తల్లి గురించి ప్రశ్నించారు. మీ అమ్మగారికి మీరు మదర్స్ డే సందర్భంగా మీ అమ్మగారికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సంతోష్ సమాధానం చెబుతూ… నా సర్వస్వం మా అమ్మే… నా సినీ కెరియర్ లో ఉండి ఎత్తు పల్లాలు అన్నీ మా అమ్మకు తెలుసు. కఠిన సమయాల్లో ఎంతో అండగా ఉండి నాకు మద్దతు తెలిపింది.
ఇప్పుడు నాకు పెద్ద పెద్ద సంస్థలలో అవకాశాలు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే అమ్మ నన్ను నమ్మింది కాబట్టే తనకు ఇలాంటి పాత్రలు వస్తున్నాయని సంతోష్ తెలిపారు.ఇక మొదటి నుంచి మాకు సొంత ఇల్లు లేదు ఎప్పటికైనా అమ్మకు ఓ పెద్ద ఇంటిని బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఈ సందర్భంగా సంతోష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.