‘సరిలేరు నీకెవ్వరు’ 6 వీక్స్ కలెక్షన్లు…!

  • February 22, 2020 / 03:56 PM IST

శివరాత్రి రోజు సెలవుని మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా బాగానే క్యాష్ చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం వారం రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి.. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 6 వ వారంలో కూడా ఈ చిత్రం పర్వాలేదనిపించింది. కేవలం 65 థియేటర్లలోనే ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్నా… ‘భీష్మ’ వంటి కొత్త సినిమాలు మరియు సంక్రాంతి విన్నర్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాల పోటీని తట్టుకుని మరీ సరిలేరు పర్వాలేదనిపిస్తుంది.

ఇక ఈ చిత్రం 6 వీక్స్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి :

నైజాం 39.85 cr
సీడెడ్ 15.64 cr
ఉత్తరాంధ్ర 19.88 cr
ఈస్ట్ 11.38 cr
వెస్ట్ 7.46 cr
కృష్ణా 8.93 cr
గుంటూరు 9.98 cr
నెల్లూరు 4.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 9.33 cr
ఓవర్సీస్ 11.95 cr
వరల్డ్ వైడ్ టోటల్ 138.46 cr (share)

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 42 రోజులు పూర్తయ్యేసరికి 138.46 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికి ఈ చిత్రం .. 221.84 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. నైజాం లో ఈ చిత్రం ఇప్పటివరకూ 39.85 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. అయితే ఈ వీకెండ్ ను ఉపయోగించుకుని 40 కోట్లను షేర్ ను వసూల్ చేస్తుందేమో చూడాలి. ఇక నిన్న శివరాత్రి సెలవు కలిసిరావడంతో.. 0.11 షేర్ ను వసూల్ చేసింది ఈ చిత్రం.

Click Here To Sarileru Neekevvaru Movie Review

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus